దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చిన ఒక ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు కన్పించాయి. జనవరి 17న, బాధితుడు దుబాయ్ నుండి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరానికి వచ్చాడు.
వచ్చిన కొద్ది రోజులకే శరీరంపై దద్దుర్లు, జ్వరంతో పాటు ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు అతడిని పరిశీలించి అధికారులకు సమాచారం అందించారు.
ఐసోలేషన్ వార్డులో బాధితుడు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.ల్యాబ్‌లో జరిగిన పరీక్షల తర్వాత అతనికి మంకీ పాక్స్ సోకినట్లు తేలింది.
ప్రస్తుతం, బాధితుడు అతని కుటుంబ సభ్యులను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్-19తో పోల్చుకుంటే, మంకీ పాక్స్ ప్రమాదం చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్యులు తెలిపారు. ఎయిర్‌పోర్టులో మంకీ పాక్స్ సోకిన బాధితునితో సాన్నిహిత్యంగా ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించాం. త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తామని అధికారులు తెలిపారు.
Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంపీ రవిచంద్ర

