ముదురు జంట నుంచి మరో ప్రేమ కథ

40
- Advertisement -

నరేష్, పవిత్ర లోకేష్ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరు మరో సినిమా చేయబోతున్నారట. అది కూడా ఇతర భాషల్లో సక్సెస్ అయిన ప్రేమ కథను తీసుకొని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ‘మా వయసుకు తగ్గట్లు కథలు దొరికితే మీ ముందుకు వస్తాం’ అని ఓ సమావేశంలో నరేష్ చెప్పాడు. మరి ‘మళ్ళీ పెళ్లి’ హిట్ అందుకోలేని ఈ జంట మరో సినిమాతోనైన హిట్ అందుకుంటాదా!!. అన్నట్టు నరేశ్, నటి పవిత్ర లోకేశ్‌ ఎట్టకేలకు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.

గత కొంతకాలంగా ముదురు ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి వేడుక జరిగనుంది. ‘ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముళ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్ర నరేశ్’ అని ఆ మధ్య నరేష్ మెసేజ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెళ్లికి నరేష్ మూడో రమ్య రఘుపతి అడ్డుగా నిలిచింది. ఎట్టిపరస్థితుల్లోనూ తన భర్తకు విడాకులు ఇచ్చేది లేదు అంటూ ఆమె ఖరాఖండిగా చెబుతుంది.

Also Read: ‘ఆదిపురుష్’ టిక్కెట్లు ఉచితం

మరి సీనియర్ నటులు నరేష్ – పవిత్ర లోకేష్ ఎలా పెళ్లి చేసుకుంటారో చూడాలి. సహజంగానే నరేష్ ఎంత సీరియస్ విషయాన్ని అయినా చాలా లైట్ తీసుకుంటాడు. పైగా తనకు ఏం కావాలో చాలా బోల్డ్ గా చెబుతాడు. మరోవైపు ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటే.. జీవితం అక్కడితో ఆగిపోతుంది అని పవిత్రా లోకేష్ నమ్ముతుంది. మొత్తమ్మీద పవిత్ర లోకేష్ తో నరేష్ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.

Also Read: తిరుమల కొండపై వికృత చేష్టలు..ఓంపై ఆగ్రహం

- Advertisement -