- Advertisement -
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ప్రయాగ్ రాజ్‌లోని సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో టెంట్ లు అగ్నికి ఆహుతి అయ్యిపోయాయి.
మంటలు చెలరేగిన ప్రాంతంలో ఆకాశం నిండా దట్టమైన నల్లని పొగలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరగనుండగా ప్రపంచ దేశాల నుండి భక్తులు తరలివస్తున్నారు.
#WATCH | Prayagraj | A fire breaks out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra. Fire tenders are at the spot. More detail awaited pic.twitter.com/G4hTeXyRd9
— ANI (@ANI) February 7, 2025
Also Read:వేసవిలో రాగిజావ తాగడం మంచిదేనా?
- Advertisement -

