టి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు ఆ మద్య ఏ స్థాయిలో నడిచిందో అందరికీ తెలిసిందే. పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ అనే వార్ నడిచింది. ఫలితంగా పార్టీలో వర్గ విభేదాలు పెరిగి చీలిక ఏర్పడే దిశగా అడుగులు పడ్డాయి. ఇంతలోనే కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం టి కాంగ్రెస్ స్థితిగతినే మార్చేసింది. అందరూ విభేదాలను పక్కన పెట్టి.. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఒకే తాటిపై నడిచేందుకు సిద్దమయ్యారు. అయితే లోలోపల విభేదాలు అలాగే ఉన్నాయనేది అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. .
ప్రస్తుతం తెలంగాణలో బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అనే విధంగా హస్తం నేతలు ముందుకు సాగుతున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో కూడా రిపీట్ అవుతాయని హస్తం నేతలు చెబుతూ.. చేరికలను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంచితే బిఆర్‌ఎస్ నుంచి బహిష్కరించబడి గత ఆరు నెలలుగా తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరడం కన్ఫర్మ్ అయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంతమేర ప్రభావం చూపగలిగే పొంగులేటికి హస్తం పార్టీలో ఎలాంటి ప్రదాన్యత ఉండబోతుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ.
Also Read:పొలిటికల్ ఎంట్రీపై రాయుడు..
తాజాగా పదవులకు సంబంధించి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించిన శిరసావహిస్తానని చెప్పుకొచ్చారు. అయితే పదవుల విషయంలో కాంగ్రెస్ లో జరిగే రగడ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై ఇప్పటికీ కూడా సీనియర్ నేతలు వ్యతిరేకత చూపుతూనే ఉన్నారు. ఇప్పుడు పొంగులేటికి ప్రదాన్యత ఉండే ఏ పదవి ఇచ్చిన హస్తం పార్టీలోని ఇతర నేతల నుంచి గట్టిగానే వ్యతిరేకత ఏర్పడే అవకాశం లేకపోలేదు.దాంతో పొంగులేటి రాకతో మరోసారి హస్తం పార్టీలో కల్లోలం తప్పెలాలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:CM KCR:గిరిజనులపై కేసులు ఎత్తేస్తాం