అక్కడ వానలు…ఇక్కడ చలి

126
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రంగ్ తుఫానుతో ఏపీకి ముప్పు లేనట్టేనని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రంగ్ తుఫాను స్థిరంగా కొనసాగుతూ గంటకు 21 కి.మీ వేగంతో ఉత్తర ఈశాన్య దిక్కుగా పయనించి బంగ్లాదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలకు తాకుతుందని అంచనా వేసింది.
సోమవారం రాత్రి 9.30గంటల నుంచి 11.30గంటల మధ్య పశ్చిమ బెంగాల్‌ తీరాన్ని దాటిన సిత్రంగ్‌ తుఫాను బంగ్లాదేశ్‌ తీరాన్ని బరిసాల్‌కు సమీపంలో దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ బెంగాల్ జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి వాతావరణం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఆంధ్ర, ఒడిషా, తమిళనాడు రాష్ట్ర తీరప్రాంత ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు.

తాజాగా ఆగ్నేయ బంగాళాఖతంలో మరో వాయుగుండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది తమిళనాడు, శ్రీలంక మధ్యన ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబరు 29నుంచి వర్షాలు పడే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తోంది. ఒక వైపు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గి…చలి ప్రభావం పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు.

సిత్రంగ్ తుఫాను కారణంగా తెలంగాణలో వర్షాలు లేకున్నా.. చలి తీవ్రత పెరుగుతోందని తెలిపారు. తుఫాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయన్నారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాది నుంచి గంటకు 8 నుంచి 10కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

- Advertisement -