కాంగ్రెస్ కు మరో దెబ్బ.. ఆ ఇద్దరు గుడ్ బై ?

51
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆదిపత్య పోరు, వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడిన హస్తం పార్టీ.. కర్నాటక ఎన్నికల విజయం తరువాత గేరు మార్చి సరికొత్త జోష్ తో దూసుకుపోతోంది. సీనియర్స్ అంతా కూడా కలిసి ఒకే తాటిపైకి వచ్చి పార్టీని ముందుకు తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరికలు కూడా బాగానే జరుగుతున్నాయి. బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు ఇద్దరు కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో హస్తం పార్టీకి మరో గట్టి షాక్ తగిలేలా కనిపిస్తోంది. పార్టీ సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ ను వీడే ఆలోచనలో ఉన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు హస్తం పార్టీ వ్యవహారాలపై అంటిఅంటనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనికి కారణం వీరికి పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదనే కారణం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు బి‌ఆర్‌ఎస్ లో చేరేందుకు సిద్దమౌతున్నారని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ లోని కొంత మంది నేతలతో ఈ ఇద్దరు టచ్ లో ఉంటున్నారట. ఇదే గనుక జరిగితే హస్తం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే.

Also Read: షర్మిల పార్టీ విలీనం.. జగన్ స్కెచ్ యేనా ?

ఎందుకంటే కాంగ్రెస్ లో సీనియర్ నేతలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు జగ్గారెడ్డి ఎంతో కాలంగా విధేయత చూపుతూ వస్తున్నారు. అయితే గత కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలలో బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారు ఉన్నంత యాక్టివ్ గా ఈ ఇద్దరు కనిపించడంలేదు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ ఇద్దరిని లైట్ తీసుకున్నట్లు వినికిడి. అందుకే ప్రాధ్యాన్యం లేని చోట ఉండడం కన్నా పార్టీ మారడమే మంచిదనే నిర్ణయానికి వీరిద్దరు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని.. ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఈ అంశం తెగ వైరల్ అవుతోంది. మరి జగ్గారెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే పార్టీ మారతారా ? లేదా వైరల్ అవుతున్న వార్తలను రూమర్స్ అని కొట్టి పారేస్తారా చూడాలి.

Also Read: KTR:అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలి

- Advertisement -