మరో ఆరు ఆస్పత్రుల కోవిడ్ ట్రీట్‌మెంట్ గుర్తింపు రద్దు..

270
corona
- Advertisement -

ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రజల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా ఝుళిపిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు కొనసాగుతుండగా మరో 6 హాస్పిటల్స్ కు కోవిడ్ ట్రీట్మెంట్ ను రద్దు చేసింది హెల్త్ డైరెక్టరేట్.

దీంతో మొత్తం ఇప్పటి వరకు 22 హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ రద్దు అయింది. ఇందులో కిమ్స్, సికింద్రాబాద్..సన్ షైన్ , గచ్చిబౌలి సెంచరీ, బంజారాహిల్స్..లోటస్, లకిడికాపుల్..మెడిసిన్, ఎల్బీనగర్..ఇంటెగ్రో .. టోలిచౌక్ఉన్నాయి. ఇప్పటి వరకు 174 ఫిర్యాదులు అందగా 113 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -