మరో మూడు రోజులు వర్షాలు..

110
ts
- Advertisement -

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని..కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.

సీతాఫల్‌మండిలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక బన్సీలాల్‌పేటలో 6.7 సెంటీమీటరలు, వెస్ట్‌ మారేడుపల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీనగర్‌లో 5.8, బాలానగర్‌లో 5.4, ఏఎస్‌రావ్‌ నగర్‌లో 5.1, బేగంపేట పాటిగడ్డలో 4.9, చిలుకానగర్‌లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్‌ నిలిపివేశారు.

- Advertisement -