మాజీ మంత్రి హరీశ్‌ రావుపై కేసు నమోదు

2
- Advertisement -

మాజీ మంత్రి హరీశ్‌ రావుపై పోలీస్ కేసు నమోదైంది. తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్‌ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీశ్‌రావుపై 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌తో పాటు సంతోష్‌కుమార్, రాములు, వంశీలపై కేసు నమోదైంది.

గతంలో కూడా చక్రధర్ గౌడ్‌.. హరీశ్‌ రావుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హరీశ్‌ రావుతో పాటు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో హరీశ్‌ రావుకు ముందస్తు బెయిల్ లభించింది.

Also Read:కిషన్ రెడ్డిపై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

- Advertisement -