మొక్కలునాటిన కొరియోగ్రాఫర్ అన్నీ మాస్టర్…

648
anni master gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జబర్దస్త్ కమెడియన్ నేహన్త్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ నేడు గచ్చిబౌలి లోని ఖాజా గూడ లో మొక్కలు నాటారు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆన్నీ ( Annie ) మాస్టర్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ఇద్దరు ( రిచా పనయి , శిత మైత్రా ) లను మొక్కలు నాటి ఛాలెంజ్ స్వీకరించాలని తెలిపిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆన్నీ…ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ , కార్పొరేటర్ సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -