జీహెచ్‌ఎంసీ పాలిట అక్షయ పాత్ర : అన్నపూర్ణ పథకం

63
annapurna
- Advertisement -

హైదరాబాద్‌ మహా నగరం పేద ప్రజల ఆకలి తీరుస్తోంది. కూలీలు, ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు కేవలం ఐదు రూపాయలకే భోజనం అందించే అన్నపూర్ణ భోజనం లబ్దిదారుల సంఖ్య 10 కోట్లకు చేరువయ్యింది. 1మార్చి 2014న అప్పటి నగర కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ చొరవతో ఈ అన్నపూర్ణ పథకంను జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ పథకం ద్వారా 2014 నుంచి 2022 మే నెలాఖరు వరకు 9 కోట్ల 67 లక్షల 53 వేల 612 భోజనాలు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం 185.89 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు సర్కారు వెల్లడించింది.

కోవిడ్‌ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల భోజనాలు అందించేవారు. విపత్తు సమయాల్లో ఉచితంగా భోజనాలు అందించారు. అన్న పూర్ణ పథకం ద్వారా ప్రతి రోజు మధ్యాహ్న భోజనం సమయంలో దాదాపు 60,000 మందికి భోజనం అందిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం మొబైల్ క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. లాక్‌డౌన్ సమయంలో 2020-21లో దాదాపు 2.29 కోట్ల మంది భోజనం అందించారు. మొబైల్‌ క్యాంటిన్‌ల,అన్నపూర్ణ కేంద్రాల ద్వారా పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్నపూర్ణ క్యాంటిన్‌ వద్ద కూర్చునే సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు.

అన్నపూర్ణ మీల్స్‌లోని ప్రతి ప్టేట్‌లో అన్నం (400 గ్రా), సాంబార్ (120 గ్రా), ఒక కూర (100 గ్రా), ఊరగాయ (15 గ్రా), మరియు ఒక వాటర్‌ ప్యాకెట్‌ ఉంటాయి. ఈ చొరవ పేదలకు, ప్రత్యేకించి హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వెళ్లే రోజువారీ కూలీ కార్మికులకు ఒక వరంలా కనిపిస్తుంది. ప్రధాన ల్యాండ్‌మార్క్‌లు మరియు వీధులతో పాటు, కొన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు. నగరంలో పేదలు, చిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగార్థులకు అక్షయపాత్రతో పాటుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది

- Advertisement -