హైదరాబాద్‌లో అన్నపూర్ణ భోజనం..

188
Annapurna meals in Hyderabad
Annapurna meals in Hyderabad
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్వరలోనే అన్నపూర్ణ భోజన కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో 109 కేంద్రాల్లో రూ. 5 కే భోజనం పెడుతున్నామని గుర్తు చేశారు. వీటిని 150 కేంద్రాలకు పెంచుతామన్నారు. ఈ కేంద్రాలకు అన్నపూర్ణ భోజన కేంద్రాలుగా నామకరణం చేశామని తెలిపారు. పేదలకు నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అయిదు రూపాయల భోజనం నాణ్యంగా ఉన్నదని ఇప్పటికే ప్రతిపక్ష నేత జానారెడ్డితో సహా పలువురు కితాబిచ్చారని గుర్తు చేశారు.

అయిదు రూపాయాల భోజనాన్ని ప్రతీ రోజు వేలాది మంది వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పథకానికి ఏడాదికి రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. ఆస్పత్రులు, లేబర్ అడ్డాల్లో ఈ కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తూ.. ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భోజన కేంద్రాల వద్ద మంచినీటి సదుపాయం కూడా కల్పిస్తామని కేటీఆర్ ఈ సంధర్బంగా సభకు తెలిపారు.

- Advertisement -