రూ.5 భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

808
mallareddy

మేడ్చల్ జిల్లా కొంపల్లిలో రూ.5 భోజన కేంద్రాన్ని ప్రారంభించారు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకు రూ. 5కే భోజన కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు.

మరోవైపు కొంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో నూతన పౌరసేవ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అన్ని సేవలు ఒకే చోట ఉండడం వలను ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు మంత్రి. దాదాపు అన్ని విభాగాల సేవలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు.