లాక్ డౌన్ వేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 65 లక్షల మందిని ఆకలిని తీర్చాయి అన్నపూర్ణ క్యాంటీన్లు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మంత్రి కేటీఆర్.
ఆరేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లు ఇప్పటివరకు 5.5 కోట్ల మంది ప్రజల ఆకలిని తీర్చాయని చెప్పారు కేటీఆర్. పేదల కడుపు నింపడంలో సహకరిస్తోన్న అక్షయపాత్రకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంతకు ముందు ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం అందించేవారు. కానీ కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఉచితంగా భోజనం పెడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించారు. గత ఏడాది సిరిసిల్ల పట్టణంలో అన్నపూర్ణ క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. అక్కడే భోజనం చేశారు.
Some file pics from my visits to Annapurna centres pic.twitter.com/nZTRoUyHjx
— KTR (@KTRTRS) May 15, 2020
‘Annapurna’ meal centres launched 6 years ago by GHMC have served more than 5.5 Cr meals 👍
As #TelanganaFightsCorona these centres provided quality free meals to more than 65 lakh people. Largest program by any state
Thanks to our partner @AkshayaPatra & hardworking staff🙏 pic.twitter.com/7MXr3IRL3k
— KTR (@KTRTRS) May 15, 2020