తమిళ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ఇప్పటికే తమిళ అగ్రహీరోలు కమల్, రజనీ, విజయ్ రాజకీయ ఎంట్రీపై రోజుకో వార్తలు వెలువడుతుండగా తాజాగా వీరి బాటలో హీరోయిన్ అంజలి చేరింది. అయితే, రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో.. ‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’, ‘గీతాంజలి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘డిక్టేటర్’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ‘అంజలి’ తెలుగు, తమిళ సినీ రంగాల్లో హీరోయిన్గా
తనదైన గుర్తింపు సంపాదించుకొంటోంది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రంలో రెండు పాత్రలను పోషిస్తోంది. సత్యదేవ పిక్చర్స్ బ్యానర్‌పై విమల్, అంజలి జంటగా ‘అల్లుడు సింగం’. మాస్ ఎంటర్టైనర్ని రావిపాటి సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
రాజకీయ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ‘అల్లుడు సింగం’ లో అంజలి ముఖ్య పాత్ర పోషిస్తోందని, లాయర్, రాజకీయ నేతగా రెండు రకాల పాత్రల్లో కనిపించబోతుందని రావిపాటి పేర్కొన్నారు. సరికొత్త గ్లామర్ లుక్‌తో ఇప్పటి వరకు మరే సినిమాలో చేయని విధంగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అంజలి కనపడనుందట. లవ్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాధారవి నటన, కమెడియన్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయని తెలిపారు.