పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కామారెడ్డి శరత్ విసిరినా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో భాగంగా మొక్కలు నాటి , వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు . పల్లె ప్రకృతి వనాలకు ప్రాధ్యానత ఇస్తున్నట్లు తెలిపారు . దీనికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు . ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ పాఠశాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారికి , బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ దూబేకి , హరితహారం ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్ కి ఛాలెంజ్ చేశారు.