‘ఎన్టీఆర్ 30’కి అతని కొట్టుడు నచ్చట్లేదు

38
- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తీసిన ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలతో ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సంచలనమే. ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో ఇంకో సినిమా రూపొందుతోంది. కానీ ఈ సినిమాకి మాత్రం దేవిశ్రీప్రసాద్ ను తీసుకోలేదు. దేవి ప్లేస్ లో అనిరుధ్ రవిచంద్రన్ పట్టుకొచ్చారు. అయితే, లేటెస్ట్ గా పాటల సిట్టింగ్స్ మొదలుపెట్టారు. కొరటాల శివ – అనిరుధ్ కథకు అనుగుణంగా ట్యూన్లు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కానీ.. అనిరుధ్ ఎన్ని ట్యూన్లు ఇచ్చినా కొరటాల శివకు ఎక్కట్లేదు.

ఎన్టీఆర్ 30 ఆల్బమ్ మ్యూజికల్ గా సూపర్ గా ఉండాలి అనేది కొరటాల శివ ఆశ. కానీ, అనిరుధ్ రవిచంద్రన్ మాత్రం రెగ్యులర్ సినిమాలకు కొట్టినట్టే ట్యూన్లును కంపోజ్ చేస్తున్నాడు. ఇది ఎక్స్ పెక్ట్ చేయని ఎన్టీఆర్ కూడా అనిరుధ్ రవిచంద్రన్ విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరి తమ కలయికలో కలిసొచ్చిన దేవిశ్రీప్రసాద్ నే.. ఎన్టీఆర్ – కొరటాల తిరిగి పెట్టుకుంటారా?, లేక కమిట్ మెంట్ ప్రకారం అనిరుధ్ నే కంటిన్యూ చేస్తారా? అనేది చూడాలి.

Also Read: పిక్ టాక్ : ఉప్పొంగే సోకులతో అందాల అరాచకం

ఈ సినిమాలో ఎన్టీఆర్ సముద్రపు డాన్ గా నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఒక భామగా జాన్వీ కపూర్ ఇప్పటికే ఎంపికయింది. ఇంకో హీరోయిన్ ఎవరు అనేది త్వరలో చెప్తారు. అలాగే, ఎన్టీఆర్ ఈ సినిమాకి తదుపరి డేట్స్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి. అసలకే ఫ్యాన్స్ మూవీ అప్ డేట్స్ అడుగుతుంటే.. ఎన్టీఆర్ ఈ మధ్య సరదాగానే సీరియస్ అవుతున్నాడు.

Also Read: Dil Raju:’సెల్ఫిష్‌’ కోసం కొత్తగా

- Advertisement -