స్టార్ల రేంజ్‌ను పెంచేసిన ‘యానిమల్‌’

28
- Advertisement -

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీసు దూసుకుపోతుంది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబతుండగా, నాలుగు రోజుల్లో రూ.425 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. తొలి మూడు రోజుల్లో రూ.356 కోట్లు రాగా, నిన్న రూ.70కోట్ల వరకూ వసూలు చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాబీ డియోల్ విలన్‌గా నటించారు. దీంతో చాలా ఏళ్ళ తర్వాత బాబీ డియోల్ కి డిమాండ్ పెరిగింది. అలాగే, రణ్‌బీర్ కపూర్ క్రేజ్ డబుల్ అయ్యింది.

అన్నట్టు యానిమ‌ల్ సినిమాలో హీరోయిన్ ర‌ష్మికతో పాటు మ‌రో యువ నటి కూడా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ఆమె త్రిప్తి దిమ్రి. యానిమ‌ల్ త‌ర్వాత అమ్మ‌డుకు బాగా క్రేజ్ పెరిగినట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో యానిమ‌ల్ రిలీజ్‌కు ముందు 6 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు ఉండ‌గా, ఇప్పుడు ఆ సంఖ్య 1.5 మిలియ‌న్లకు చేరుకుంది. మొత్తానికి అమ్మ‌డు క్రేజ్‌ యానిమ‌ల్ పెంచేసింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అటు అందాల భామ రష్మిక మందన్న కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. రష్మికను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 40 (4 కోట్ల మంది) మిలియన్లకు చేరింది.

కేవలం యానిమల్ సినిమా కారణంగానే రష్మిక మందన్నకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 40 మిలియన్ల స్థాయికి చేరిందని టాక్. నిజానికి ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కన్నడ భామ కొద్దికాలంలోనే అగ్రహీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. ఐతే, ‘యానిమల్’తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. అక్కడ కూడా భారీగా ఫాలోయింగ్ తెచ్చుకుంది. మొత్తానికి యానిమల్ స్టార్ల రేంజ్ ను పెంచేసింది.

Also Read:ఈగల్..ఊర మాస్ అంథమ్

- Advertisement -