అనిల్ – వెంకీ..రిలీజ్ డేట్ ఫిక్స్!

26
- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం. 58లో హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఈ న్యూ మూవీ హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇన్-ఫార్మ్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ సహ రచయితలు. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుండగా వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.

Also Read:‘కన్నప్ప’.. తిన్నడు విల్లు విశేషాలు

- Advertisement -