లేడి ఓరియెంటెడ్ మూవీతో వస్తున్న అనిల్ రావిపూడి!

203
anil ravipudi
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్‌ని షేక్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంతో ఎఫ్‌ 2 సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్న అనిల్…వెంకటేష్‌,వరుణ్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో మరో ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నారు.

ఓ లేడి ఓరియెంటెడ్‌ స్క్రిప్ట్‌ని తెరకెక్కించే పనిలో ఉండగా టాలెంటెడ్‌ బ్యూటీ సాయి పల్లవితో తీయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -