మళ్లీ బీభత్సమే.. ఇక బాలయ్య మారడా?

38
- Advertisement -

దర్శకుడు అనిల్ రావిపూడికి హాస్య దర్శకుడు అని మంచి పేరుంది. సో.. బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలో కూడా మంచి ఫన్ ఉంటుందని.. బాలయ్య బాదుడు నుంచి చాలా ఏళ్ల తర్వాత బాలయ్య అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారని ఇన్నాళ్లు ఓ ఆశ ఉండేది. కానీ, అనిల్ రావిపూడి కూడా అదే ఊర కొట్టుడు సినిమా తీసి పెట్టాడు. భ‌గ‌వంత్ కేస‌రిలో కూడా దంచుడే దంచుడు. తెర నిండా బాలయ్య బీభత్సమే. అచ్చమైన బోయపాటి సినిమాలాగే అనిల్ రావిపూడి కూడా తన భ‌గ‌వంత్ కేస‌రి సినిమాని మలిచాడు.

ఈ సినిమా రష్ చూసిన ఓ రచయిత నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం ఈ ఆర్టికల్ రాయడమైంది. ఇంతకీ, భ‌గ‌వంత్ కేస‌రి సినిమా ఎలా ఉంది అంటే.. సినిమాలో లాజిక్కులు వెతక్కూడదు. పైగా నరుకుడే నరుకుడు ఉంటుంది. బీభ్సమైన హింస… గాల్లోకి తేలిపోతూ రౌడీలు… సూపర్ మ్యాన్‌లా బాలయ్య ఫైటింగులు… భీకరమైన బీజీఎంతో బాలయ్య నెత్తురు పారిస్తూ ఉంటాడు… థియేటర్ దడదడలాడిపోతూ ఉంటుంది… మొత్తమ్మీద అటు జైలులో కూడా బాలయ్య దంచుడే దంచుడు కార్యక్రమం ఉంటుంది. ఇక కథా కాకరకాయా అంటారా ?, అలాంటి వాటి కోసం ఏ మాత్రం చూడొద్దు అని సగటు ప్రేక్షకుడికి మనవి చేసుకోవాల్సిన పరిస్థితి.

బాలయ్య ఇక మారడా…?, బాలయ్య నుంచి సరికొత్త సినిమాలు ఇక రావా ?, ఒక్క ముక్కలో చెప్పాలంటే… బాలయ్య నుంచి ఎప్పుడూ ఊర మాస్ మసాలా రొటీన్ దంచి కొట్టుడు మూవీలే వస్తాయా ?. బాలయ్య ఇమేజీని ఆకాశం ఎత్తులో నిలబెడుతున్నాము అనుకుంటారు మన దర్శకులు. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాల్ని ఎవరూ ఇష్టపడటం లేదు అనే నిజాన్ని ఎందుకు గుర్తించడం లేదో… రొటీన్ బాలయ్య మార్క్ మాకోద్దండీ అని ప్రేక్షకులు ఇంకెన్నాళ్లు పోస్ట్ లు పెట్టాలండీ బాబు. భ‌గ‌వంత్ కేస‌రి అంటే వినూత్నంగా ఉంటుంది అనుకున్నా.. అనుకున్నట్టుగానే ఉంటుంది అన్నమాట.

Also Read:వినాయకుడి లడ్డూ @ రూ.కోటి 25 లక్షలు

- Advertisement -