ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని అలాగే ఈటల రాజేందర్ కూడా వారికి నచ్చిన పార్టీలో చేరొచ్చు.. కానీ అక్కడి నాయకుల మెప్పు కోసం రాజకీయ జీవితమిచ్చిన టి.ఆర్.యస్ పార్టీని,కెసిఆర్ గారిని విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. నిన్నటి దాకా ఆరోగ్యమంత్రిగా పని చేసిన మీరు, కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం కరోనా సందర్భంగా ప్రజలను గాలికి వదిలేసి, దాని కట్టడిలో విఫలమైన సంగతి అందరి కంటే ఎక్కువ మీకే తెలుసు. ప్రపంచమంతా వారిని విమర్శించిస్తుంటే, దేశ ప్రజలు ప్రధానమంత్రి రాజీనామాను కోరుతుంటే, మీకేమో బీజేపీ గొప్పగా కనబడడమేంటో విచిత్రంగా ఉందని అనిల్ ఎద్దేవ చేశారు.మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత ఆస్తుల రక్షణ కోసం ప్రజల్ని పట్టించుకోని పార్టీలో చేరడంతో ప్రజలకు మీ నిజస్వరూపం అర్థమైందన్నారు అనిల్ కూర్మాచలం.
నిన్న ఢిల్లీలో మీకు ఎంతటి ఆత్మగౌరవం లభించిందో ప్రజలంతా గమినించారని, మంత్రులని, ఎమ్మల్యేలని ఆత్మవిమర్శచేసుకోమనడం కాదు.. ఢిల్లీ పోయి వచ్చినంక మీరు ఆత్మవిమర్శచేసుకొండి మీ ఆత్మగౌరవం పెరిగిందా తగ్గిందా అని అనిల్ ప్రశ్నించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టిందే ఢిల్లీ పార్టీలు వివక్ష చూపిస్తున్నారని ఆత్మగౌరవం దక్కడం లేదనే, కానీ మీరు మాత్రం ఆత్మగౌరవం కోసం ఢిల్లీ పార్టీలో చేరడం విడ్డురంగా ఉందని అనిల్ కూర్మాచలం తెలిపారు.
మీకు ఢిల్లీలో ఏదైనా గౌరవం దక్కిందంటే అది కెసిఆర్ మీకిచ్చిన రాజకీయ అవకాశాల వల్లే, ఒక సామాన్య వ్యాపారస్థుడి నుండి రాష్ట్ర మంత్రిగా ఎదగడం వల్లే అనే సంగతి మర్చిపోవద్దని, తెరాస పార్టీ పైన కెసిఆర్ గారి పైన ఇష్టం వచిన్నట్టు విమర్శలు చేస్తే జవాబు కూడా అంతే బలంగా ఉంటుందని, కెసిఆర్ గారి నాయకత్వాన్ని యావాత్ తెలంగాణ కోరుకుంటున్నదని, ప్రజలంతా మీకు తగిన బుద్ది చెప్తారని అనిల్ హెచ్చరించారు.
ఒక పక్క ఉద్యమకారులకు అవకాశం రావడం లేదని విమర్శించడం, పదవులన్నీ అనుభవించి ఈ రోజు అదే పార్టీ నాశనం కోరుకోవడం మీ నీతి లేని, మానవత్వం లేని వ్యక్తిత్వానికి నిదర్శనమని. మీకు వ్యక్తిగతంగా సమస్యలుంటే పార్టీ నాయకత్వంతో లేక కోర్టులో చూసుకోవాలని, అంతే కానీ ఎంతో మంది నమ్ముకున్న పార్టీ నాశనం కోరుకోవడంతో మీకు ఇతర సహచరుల పట్ల మీ రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన వారి పట్ల ఎంత బాధ్యత ఉందొ తెలుస్తుందని, ఇది ప్రజలంతా గమనిస్తున్నారని అనిల్ తెలిపారు.
రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా హుజురాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ మాటలని నమ్మే పరిస్థితిలో లేరని, తన స్వార్థం కోసం బీజేపీలో చేరారని, తన ఆస్తులని కాపాడుకోవడం కోసమే ఢిల్లీ పార్టీ అండను కోరుకున్నారని, కానీ ప్రజలు మాత్రం సరైన సందర్భంలో తగిన బుద్ది చెప్తారని, కెసిఆర్ వెంటే హుజురాబాద్ ప్రజలున్నారని, కెసిఆర్ గారికి కూడా హుజురాబాద్‌పై ప్రత్యేక ప్రేమ ఉందని, రైతు బంధు పథకాన్ని ప్రారంభించిందే హుజురాబాద్ లోనని, అంతటి గౌరవం కెసిఆర్ గారికి హుజురాబాద్ అంటే అని అనిల్ తెలిపారు.
ఎన్నారై శాఖ నుండి గ్రామ కార్యకర్త వరకు హుజురాబాద్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలుపుకి పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని, తప్పకుండా కెసిఆర్ నాయకత్వమే తెలంగాణ శ్రీరామా రక్ష అని ప్రజలు భావిస్తున్నారని, మళ్ళీ తెరాస అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ గారికి వారి కృతజ్ఞతను తెలియజేసుకుంటారని అనిల్ కూర్మాచలం తెలిపారు.