- Advertisement -
అనిల్ కపూర్ భారతదేశంలో టాప్ స్టార్లలో ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అందించారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ తెలుగు సినీ రంగంలో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా చేస్తున్న తన కొత్త చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర కోసం అనిల్ కపూర్‌ను ఇటీవల కలిశారని తెలిసింది.వెంకీ అట్లూరి తన కొత్త సినిమా కథను అనిల్ కపూర్‌కు వినిపించి, ఒక కీలకమైన పాత్ర చేయమని కోరారట.
అనిల్ కపూర్ తన పాత్ర నచ్చి అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అనిల్ కపూర్ 1980లో బాపు దర్శకత్వంలో వచ్చిన “వంశ వృక్షం” సినిమాతోనే తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు.
Also Read:పడవ బోల్తా.. 40 మంది గల్లంతు!
- Advertisement -

