- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ కాంబో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో కీలకపాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. మహేష్‌కి తండ్రి పాత్ర కావడంతో దీనికి అనిల్‌ని ఎంపిక చేశారట త్రివిక్రమ్. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా జూన్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుందట.
పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ నటించిన సర్కారువారి పాట విడుదలకు సిద్ధంగా ఉంది.
- Advertisement -