Anikha:ఆ యంగ్ బ్యూటీకి మరో అవకాశం

22
- Advertisement -

అనిఖా సురేంద్రన్.. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి.. తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ. బుట్ట బొమ్మ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చాలా మంది హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. తొలి సినిమాకే వెనుతిరిగే తారలు చాలామంది. ఈ అందాల సుందరి ‘అనిఖా సురేంద్రన్’ కూడా అలానే వెనక్కి వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. ఎందుకంటే, ఆమె హీరోయిన్ గా నటించిన బుట్ట ‘బొమ్మ సినిమా’ రిజల్ట్ అలాంటిది మరి.

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకి శౌరీ చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఈ సినిమాతో హీరోయిన్ గా మొదటిసారి పరిచయమైంది అనిఖా సురేంద్రన్. అయితే ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. దీంతో అనిఖా సురేంద్రన్ ని పట్టించుకునేవాడు లేడు. సోషల్ మీడియాలో ఆమె అందాలు అడవి కాచిన వెన్నెలగా మారాయి.

ఇక అనిఖా సురేంద్రన్ దుకాణం సర్దేస్తుందని అంతా అనుకుంటున్న టైమ్ లో, మరో సినిమాతో మెరవబోతోంది. నిర్మాత నాగవంశీ కొత్త సినిమాలో అనిఖా సురేంద్రన్ ను తీసుకున్నారు. ఈ మూవీ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. ఇక ఇందులో అనిఖా సురేంద్రన్ పాత్ర కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందట. మరి ఈ చిన్న సినిమాతోనైనా అనిఖా సురేంద్రన్ మెరుస్తుందేమో చూడాలి.

Also Read:

 

- Advertisement -