సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్సులోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంగన్వాడీ టీచర్లు . తమ డిమాండ్లు పరిష్కరించాలని అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచివాలయం ముట్టడికి దాదాపు బస్సుల్లోనే వచ్చారు అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీ టీచర్లను అదే బస్సులో పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
ఇక అన్ని జిల్లాల బస్ స్టాండుల్లో తనిఖీలు చేసి హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు అంగన్వాడీలు. ఈ క్రమంలో ఈరోజు ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉండడంతో, హైదరాబాద్ వస్తున్న అంగన్వాడీలను బస్ స్టాండులో అడ్డుకుంటున్నారు పోలీసులు.
ఆధార్ కార్డులు అడిగి, హైదరాబాద్ వెళితే కేసు నమోదు చేయాల్సి వస్తుందని అంగన్వాడీలను బెదిరిస్తున్నారు పోలీసులు.
Also Read:వెంకట్ మృతి..సాహిత్య రంగానికి తీరని లోటు

