అందుకే జాగ్రత్తగా ఉంటుందట!

42
- Advertisement -

నేటి హీరోయిన్లు ఎంతో తెలివిగా ఉంటున్నారు. చిత్ర పరిశ్రమలో స్థిరపడిన తర్వాత కూడా మరో రంగంలో రాణిస్తున్నారు. నచ్చిన మరో విభాగంలో పేరు తెచ్చుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా నిర్మాతగా ప్రయత్నాలు చేసింది సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. కనెక్ట్ అనే సినిమాని నిర్మించి రిలీజ్‌ కూడా చేసింది. సినిమాలో మ్యాటర్ ఉండటంతో బాగానే డబ్బు చేసుకుంది. ఐతే, నిర్మాతగా తన ప్రయత్నం గురించి చెబుతూ.. ఇన్నేళ్లు నటిగా తీరిక లేనందువల్ల తన నిర్మాణ ప్రయాణం ముందుకు సాగ లేదు అని, కానీ ఇక నుంచి ఆ ప్రయాణం సాగుతుందని నయనతార చెప్పుకొచ్చింది.

నయనతార ఇంకా మాట్లాడుతూ.. నిర్మాణంలో తాను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని, ఆ సాధన, అభ్యాసం చేయకుండా ఇకపై సినిమాలు నిర్మించకూడదని నిర్ణయించుకున్నట్లు నయనతార వెల్లడించింది. కానీ, ఇప్పటికే నిర్మాణంలోని మెళుకువలను నేర్చుకుంటున్నాను అంటూ నయనతార చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పలు ఓటీటీ కంపెనీల కోసం బెస్ట్ కంటెంట్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నాను అని ఆమె తెలిపింది.

నయనతార ఇంకా మాట్లాడుతూ…‘మనకు ఇష్టమైన కొన్ని పనుల మీద సమయం వెచ్చిస్తుంటాం. వాటి మీద ఆసక్తి ఉన్నా, కొన్నిసార్లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా నయనతార నిర్మాత అయింది కాబట్టి, ఆమె సినిమాలను ప్రేక్షకులు చూడరు. సినిమా బాగుంటేనే చూస్తారు. కాబట్టి, ఒక నిర్మాతగా నా సినిమాల మీద నేను ఎక్కువ దృష్టి సారించాల్సిన ఒత్తిడి ఉంది. అందుకే కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నా అంటూ నయనతార చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ హీరోయిన్ కి కూడా ఇవ్వాలట!

మార్చి8..చమ్కీల అంగీలేసి సాంగ్‌

ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

- Advertisement -