ఇప్పటికే తమన్నా – విజయ్ వర్మ పెళ్లి డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి దిశగా అడుగులు వేస్తోందని టాక్. ఆమె పేరు ‘ఆండ్రియా జెర్మియా’. హీరోయిన్ ఆండ్రియా జెర్మియా, ఓ తమిళ నిర్మాత కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నారట. ఇద్దరూ తమ రిలేషన్ షిప్ ను అంగీకరించలేదు కానీ, ఓపెన్ గానే ఉన్నారట. సోషల్ మీడియాలో కలిసి దిగిన ఫొటోలు కూడా పెడుతున్నారు. ఆ మధ్య ఆండ్రియా అతనితో కలిసి రీల్స్ కూడా చేసింది. కానీ, తమ ఎఫైర్ విషయంలో ఎలాంటి నిజం లేదు అంది.
అంతెందుకు, న్యూ ఇయర్ వేడుకలను కూడా అతనితోనే ఆండ్రియా జెర్మియా సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోల్ని కూడా అప్పుడు బయటపెట్టింది. అలా కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు టాక్. ఆండ్రియా జర్మియా – ఆ నిర్మాత వివాహానికి ఆండ్రియా జర్మియా కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఆండ్రియా జర్మియా – ఆ నిర్మాత ఓ ఇంటివారు కాబోతున్నారు.
ఐతే, ఇప్పటికే ఆ నిర్మాతకి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. కానీ భార్యకు అతను కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం ఓ వెబ్ సిరీస్ కోసం అతను ఆండ్రియా జర్మియాని కలిశాడు. అప్పుడే వీళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పట్నుంచి ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. ఇప్పుడు తమ బంధాన్ని వివాహంతో అధికారికంగా మార్చుకోవాలని భావిస్తోంది ఈ జంట. మొత్తానికి ఆండ్రియా ఏం చేసినా స్పెషలే.
Also Read:వాకింగ్ చేసేటప్పుడు.. జాగ్రత్త!