వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించాడు.
37 ఏళ్ల ఈ ఆటగాడు విండీస్ తరుపున ఓ టెస్టు, 56 వన్డేలు, 84 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన ఒక్క టెస్టు మ్యాచ్‌లో రెండు పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. వన్డేల్లో 1034 పరుగుల చేయడంతో పాటు 70 వికెట్లు తీశాడు. టీ20ల్లో 1078 పరుగులు చేయడంతో పాటు 61 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా కూడా ప్రపంచ వ్యాప్తంగా వివిధ టీ20 లీగుల్లో ఆడతానని రసెల్ తెలిపాడు.
వెస్టిండీస్ జట్టు ఇదే..
షై హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్.
Also Read:ఆర్సీబీ విక్టరీ పరేడ్..హైకోర్టుకు నివేదిక

