ఏపీలో తొలి ఫలితం నర్సాపురం.. చివరిగా

233
ap-polls
- Advertisement -

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నారు. దేశ వ్యాప్తంగా 18లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. ఇక దేశం మొత్తం ఏపీపైనే దృష్టి సాధించింది. ఏపీ ఫలితాలపై టీడీపీ, వైసీపీలు ధీమాతో ఉన్నాయి. ఏపీలో మొట్టమొదటి ఫలితం పశ్చిమగోదావరి నర్సాపురం నుంచి వెలువడగా..చివరగా రాజమహేంద్రవరం రూరల్, రంపచోడవరం ఫలితాలు వెలువడనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో త్వరగా వెలువడే నియోజకవర్గాలు..

కొవ్వూరు, పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు, గుంటూరు తూర్పు, నెల్లూరు రూరల్, ప్రత్తిపాడు,, నగరి, అనపర్తి, పార్వతీపురం, మాడుగుల, విశాఖపట్నం దక్షిణం, విశాఖ పశ్చిమం, వేమూరు ఫలితాలు కొంచెం తొందరగా రానున్నాయి.

కాస్త ఆలస్యమయ్యే నియోజకవర్గాలుః జగ్గంపేట, అమలాపురం, పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం అర్బన్, తుని, పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ సిటీ నియోజకవర్గాల ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి.

- Advertisement -