సభలపై జగన్ కీలక నిర్ణయం….

137
cm jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రోడ్లపై సభలు ర్యాలీలను నిషేదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆఉత్తర్వులో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లా, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై సభలు ర్యాలీలు నిషేదించినట్టు తెలిపారు.

ప్రజలకు ఇబ్బంది కలగకూడని ప్రాంతాల్లో సభలు పెట్టుకోవచ్చని అందులో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. సభలు నిర్వహించుకోవాలంటే రోడ్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని తెలిపింది.

ఇటివలే చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాట నేపథ్యంలో 8మంది మరణించిన విషయం తెలిసిందే. కందుకూరు సభలో చంద్రబాబు మాట్లుడుతున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే భవిష్యత్‌లో జనసేనాని పవన్ రోడ్డు షో నిర్వహించనున్న వేళ ఇప్పడు ప్రభుత్వం ఉన్నట్టుండి ఇలాంటి ఉత్తర్వులు తేవడంపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కు జనంలో మంచిపేరు వస్తుందని అక్కసుతోనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

ఆంధ్రా నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

దేశం కోసం బీఆర్‌ఎస్:సీఎం కేసీఆర్‌

బీఆర్ఎస్‌ గెలిస్తే..పోలవరం పూర్తి

- Advertisement -