- Advertisement -
ఏపీలోని ఒంగోలులో విషాదచాయలు అలుముకున్నాయి. అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన కొప్పోలు గ్రామానికి చెందిన కార్తీక్ అనే విద్యార్థి ఇటీవల ఎంఎస్ చదువుకోసం షికాగో వెళ్లాడు. నిన్న ఆకస్మాత్తుగా గుండెలో నొప్పిరావడంతో ఉన్న స్థానంలో కుప్పకూలి మరణించాడు.
కుమారుడి మరణం వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. కార్తీక్ మృతదేహాన్ని తరలించేందుకు అమెరికాలోని తానా సభ్యులు ఏర్పాట్లుచేస్తున్నారు.
- Advertisement -