ఏపీ, తెలంగాణ..వెదర్ అప్‌డేట్

11
- Advertisement -

నేడు తెలంగాణలోని 16 జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌కు వర్ష సూచన ఉందని తెలిపింది.

మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి,నారాయణపేట, గద్వాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Also Read:గ్రేటర్‌లో 3 రోజులు వైన్స్ బంద్

ఏపీలో 51 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుంది విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం-4, విజయనగరం-16, పార్వతీపురం మన్యం-11 మండలాల్లో తీవ్ర వడగాలులు, శ్రీకాకుళం-1, విజయనగరం-8, మన్యం-4, అల్లూరి-1, విశాఖ-1, అనకాపల్లి-5 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -