బోరుగడ్డకు బిర్యానీ..7గురు పోలీసుల సస్పెండ్

2
- Advertisement -

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు బిర్యానీ ట్రీట్ ఇవ్వడంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అనిల్‌కు మర్యాదలు చేసిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు.

మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను ఏలూరులోని ఓ రెస్టారెంట్ కు తీసుకెళ్లిన పోలీసులు. అతనితో సరదాగ మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు పోలీసులు.

రెస్టారెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో పోలీసుల వ్యవహారం అంత నమోదు కావడం, ఆ వీడియో వైరల్ కావడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. దీంతో ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.

Also Read:కరెంట్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పోరుబాట

- Advertisement -