దేశానికే ఏపీ రోల్ మోడల్‌:చంద్రబాబు

9
- Advertisement -

దేశానికే ఏపీ రోల్ మోడల్‌ కానుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తూకివాకంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను సందర్శించారు. ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని.. అధికారులను ప్రశ్నించారు చంద్రబాబు.

రీసైకిలింగ్ కోసం వచ్చిన ఘనవ్యర్థాలను వినియోగించాక వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‍కు తరలించాలన్నారు చంద్రబాబు. తిరుపతి సహా 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఏపీ రోల్‍మోడల్ కావాలి అని తెలిపారు.

రెవెన్యూ సిబ్బంది సమష్టి కృషితో ఈ ఏడాది రెవెన్యూ వసూళ్లలో వృద్ధి సాధించాం. రాబడి మరింత పెరిగేలా అధికారులు కృషి చేయాలి అన్నారు.

- Advertisement -