ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు..

33
corona

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,728 కరోనా కేసులు నమోదైయ్యాయి. గత 24 గంటల్లో 77,148 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,728 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 290 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 36 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా ప్రభావంతో 9 మంది మరణించారు. 1,777 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,705కి పెరిగింది. ఇప్పటివరకు 8,22,011 మంది కరోనా వైరస్ బారినుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,857 మందికి చికిత్స జరుగుతోంది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 6,837కి చేరింది.