- Advertisement -
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని తాను అధిష్టానానికి సూచించానని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో సోనియా గాంధీ ఆదేశాల మేరకు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఓసారి వచ్చి కలిశాడని రోశయ్య గుర్తుచేసుకున్నారు.
జగన్ ను ఓదార్పు యాత్ర చేపట్ట వద్దని కాంగ్రెస్ అధిష్టానం ఓత్తిడి చేసిందని…కానీ ఈవ్యవహారంలో రాష్ట్ర కాంగ్రెస్ కు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వైఎస్ ఆకస్మిక మరణంతో చనిపోయిన అభిమానులను జిల్లా కేంద్రాలకు పిలిచి ఆర్ధికసాయం చేయాలని జగన్ కు సోనియా సూచించారని కానీ జగన్ అందుకు ఓప్పుకోక పోవడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు.
- Advertisement -