బైక్ ను ఢీకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు..మూడేళ్ల పాప మృతి

514
Mla Sithakka Car Accident

ములుగు ఎమ్మెల్యే సీతక్క కారు  ద్విచక్రవాహనంను ఢీకొట్టింది. దీంతో బైక్ పై   దంపతులు ఓ చిన్నారి ఉండగా ప్రయాణిస్తుండగా…దంపతులకు తీవ్ర గాయాలు కాగా మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాడు వద్ద ఈప్రమాదం చోటుచేసుకుంది.

 

చిన్నారి స్పాట్ లో మృతి చెందగా..గాయపడిన దంపతులను ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైక్ దాదాపుగా నుజ్జు నుజ్జు కాగా.. ఎమ్మెల్యే సీతక్క కారు ముందు భాగం ధ్వంసమైంది.