ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

50
corona

మొన్నటి దాకా ఏపీలో కరోనా ప్రభంజనం కొనసాగింది. ప్రతి రోజు వేలాది కేసులు నమోదవుతూ జనాలను బెంబేలెత్తించాయి. కొన్ని రోజుల నుంచి కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 47,130 మందికి టెస్టులు నిర్వహించగా… కేవలం 545 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 117, తూర్పుగోదావరి జిల్లాలో 104, పశ్చిమగోదావరి జిల్లాలో 76 కేసులు నమోదు కాగా… కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 1,390 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కి చేరుకుంది. మొత్తం 6,948 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి.