6,676కి చేరిన కరోనా మృతుల సంఖ్య..

170
corona
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 2,886 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తం 84,401 కరోనా టెస్టులు నిర్వహించారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 493 కేసులు రాగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 36 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 17 మంది కరోనాతో చనిపోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 6,676కి పెరిగింది.

ఏపీలో ఇప్పటివరకు 8,20,565 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,88,375 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 25,514 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 3,623 మందికి కరోనా నయం అయినట్టు శుక్రవారం బులెటిన్‌లో వెల్లడించారు.

- Advertisement -