విశాఖ‌ ఎయిర్ పోర్ట్ లో సీఎం కేసీఆర్ కు ఘ‌న స్వాగ‌తం..

249
kcr in vizag
- Advertisement -

దేశంలో గుణాత్మ‌క మార్పుకోసం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు ల‌క్ష్యంగా సీఎం కేసీఆర్ దేశవ్యాప్త ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌వాళ్ల‌ను ఈఫ్రంట్ లో చేర్చుకునే అవ‌కాశాలు ఉన్నాయి. దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజీపీ అధికారమే ల‌క్ష్యంగా సీఎం కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ దేశంలోని కొంత‌మంది ముఖ్య‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు.

cm kcr

విశాఖప‌ట్నం చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కాసేప‌ట్లో సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విశాఖ‌లోని శార‌దా పీఠాన్ని సంద‌ర్శించ‌నున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదాపీఠం చేరుకుంటారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. సాయంత్రం 4.30గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తారు. అక్కడ సీఎంతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించిన అంశాల‌ను ఆయ‌న‌తో చ‌ర్చించ‌నున్నారు.

- Advertisement -