ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

9
- Advertisement -

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు రేవంత్.

కవి అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రముఖులు. ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు చంద్రబాబు.

అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకంతో పాటు మొత్తం సమాజానికే తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

Also Read:అందెశ్రీ మృతి..కేసీఆర్ సంతాపం

- Advertisement -