- Advertisement -
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశారు అందెశ్రీ. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోగా హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) అందెశ్రీ తుది శ్వాస విడిచారు.
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లన్న. 1960లో నల్లగొండ జిల్లాలో ఆయన జన్మించారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ పొందారు. 2015లో దాశరథి సాహితి పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితి పురస్కారం సాధించారు అందెశ్రీ.
Also Read:మీసాల పిల్ల..50 మిలియన్ వ్యూస్
- Advertisement -

