పవన్‌ అభిమన్యుడు కాదు…

406
Anchor Syamala Tweet on Pawan
- Advertisement -

చిత్రపరిశ్రమను, నటీనటులను, వారి కుటుంబాలను కించపరుస్తూ కొన్ని టీవీ చానళ్లు కథనాలు ప్రసారం చేస్తుంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫిల్మ్ చాంబర్‌లో మా సభ్యులతో సమావేశమైన పవన్‌…తనపై వ్యక్తిగత దూషణలు,కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాదు తన తల్లిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, కుట్రచేసిన వర్మపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు పవన్ న్యాయనిపుణులను సంప్రదించారు.

ఈ నేపథ్యంలో పవన్‌కు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా యాంకర్‌ శ్యామల సైతం స్పందించింది. శిఖండిని అడ్డుపెట్టడానికి భీష్ముడు కాదు..! పద్మవ్యూహం పన్నడానికి అభిమన్యుడు కాదు..! యుద్ధం చేస్తుంది సాక్షాత్ శ్రీకృష్ణుడే.. జాగ్రత్త’’ అని పేర్కొంది.

shyamala

- Advertisement -