బిగ్ బాస్ 3 పై కేసు నమోదు చేసిన పోలీసులు

412
Bigboss3 Anchor Swetha Reddy
- Advertisement -

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ సీజన్ 3 నిర్వాహకులపై యాంకర్‌ శ్వేతారెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా, రవికాంత్‌, రఘు, అభిషేక్‌, శ్యామ్ లపై ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని బంజారాహిల్స్‌ సీఐ కళింగరావు వెల్లడించారు.

 బిగ్ బాస్ 3ని నిషేదించాలంటూ డిమాండ్ చేస్తున్నారు యాంకర్‌ శ్వేతారెడ్డి . తనను బిగ్ బాస్ 3కి ఎంపీక చేసి..చివర్లో ఫోన్ చేసి మిమ్మల్ని రిజెక్ట్ చేశామని చెబుతున్నారని మండిపడ్డారు. అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు కూడా పెట్టించుకున్నారని తెలిపారు.

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాలంటే బిగ్ బాస్ ను ‘ఇంప్రెస్’ చేయాల్సి ఉంటుందని, అందుకే మీరేం చేస్తారు? అంటూఅంటూ పోగ్రామ్ ఇన్ చార్జ్ దారుణంగా మాట్లాడాడని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు.

- Advertisement -