సుమ సుయసుయ సాంగ్‌ అదిరింది..!

275
- Advertisement -

టాలీవుడ్ లో ఆమెకి తిరుగులేదు. ఆ సెలబ్రిటీ ప్లేస్‌ ని ఎంత మంది రీ ప్లేస్‌ చేయాలని చూసినా ఇప్పటివరకు ఎవరూ అంత దూరం వెళ్ళలేకపోయారు. ఆ సెలబ్రిటీ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పంటే..! కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్నఆ లేడీ ఎవరో కాదు. యాంకర్ సుమ!
యాంకర్‌ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాధించుకున్న సుమ ఇప్పుడు సింగర్‌ గా కూడా ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌ తాజా చిత్రం ‘విన్నర్‌’.  ఈ చిత్రంలో అనసూయ చిందులేసిన ఓ ఐటెం సాంగ్‌ హైలెట్ గా నిలుస్తుందని ఆ చిత్ర బృందం మొదటి నుండీ చెప్తూనే ఉంది. అయితే  ఆ  ఐటెం సాంగ్‌ ను పాడింది యాంకర్‌ సుమ. ఈ సాంగ్‌ విషయంలో ఆ చిత్ర యూనిట్‌ ఫస్ట్‌ నుంచీ సస్పెన్స్‌ కొనసాగిస్తూనే వస్తుంది. అయితే ఆ పాట విడుదల సందర్భంగా ఐటెంసాంగ్‌ని యాంకర్‌ సుమ పాడినట్లుగా ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

ఇటీవలే విడుదలైన ఆ ఐటెం సాంగ్‌ విన్న సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. యాంకర్‌ గా స్టార్‌డమ్‌ ఉన్న సుమ.. ఇప్పుడు సింగర్ గా కూడా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు.  సంగీత దర్శకుడు అనిరుథ్‌  ఈ ఐటెంసాంగ్‌ ను విడుదల చేసారు. ఇప్పటివరకూ ప్రేక్షకులను మాటలతో మైమరపించిన సుమ…ఇప్పుడు తాను పాడిన పాటతో ప్రేక్షకుల చేత చిందులు వేయించింది. ఇదిలా ఉండగా ఈ నెల 24న ‘విన్నర్‌’ విడుదల కాబోతోంది.

- Advertisement -