ఆమెకు వాళ్ళైనా న్యాయం చేస్తారా?

113
- Advertisement -

బుల్లితెరలో భారీ గుర్తింపు సంపాదించిన భామలలో యాంకర్ శ్రీముఖి ఒకరు. పైగా శ్రీముఖి లో మంచి నటి కూడా ఉంది. ఇక గ్లామర్ డిపార్ట్మెంట్ లో శ్రీముఖి టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. సోషల్ మీడియాకు సొగసులు అద్దే ఎంతోమంది భామలలో శ్రీముఖి ముందువరుసలోనే ఉంటుంది. అసలు గ్లామర్ అనగానే ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇంపోర్టెడ్ భామల వంక చూస్తారు కానీ, శ్రీముఖి ఎంతో సులువుగా తన అందచందాలతో వారందరికీ సమాధానం ఇవ్వగలదు.

అందుకే శ్రీముఖి ఇన్స్టా ఖాతాకు 4.6 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. వారికోసం శ్రీముఖి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఘాటు ఫోటో షూట్లు కూడా చేస్తుంటుంది. శ్రీముఖి ఫోటో షూట్లకు భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నెటిజన్లను శ్రీముఖి ఘాటు ఫోటోలు ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. అందుకే, తరుచూ ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

అయితే, బంగారు హుండీని చిల్లర వేయడానికి వాడినట్టు.. ఇన్నేళ్ళు తెలుగు సినిమా మేకర్స్ శ్రీముఖి ని యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఉపయోగించుకున్నారు. కనీసం ఆమెలో మంచి నటి ఉందని కూడా గుర్తించలేక పోయారు. కానీ, కన్నడ ఫిల్మ్ మేకర్స్ శ్రీముఖి ని హీరోయిన్ గా గుర్తించారట. ఓ కన్నడ సినిమాలో శ్రీముఖి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మరీ ఈ సినిమాతో అయినా శ్రీముఖి దశ తిరుగుతుంది ఏమో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ప్చ్ టాలెంట్ ఉన్నా లక్ లేని డైరెక్టర్!

నారప్ప…డిసెంబర్ 13న రీరిలీజ్‌

అమితాబ్ నార్త్ నుంచి సౌత్ కి..

- Advertisement -