“పటాస్” కు శ్రీముఖి గుడ్ బై..(వీడియో)

353
srimukhi

బుల్లితెరపై వచ్చే పటాస్ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది యాంకర్ శ్రీముఖి. తన అందం, మాటలు, నటనతో బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తోంది. అప్పుడప్పుడు పలు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రీముఖ చాలా టీవీ షోలు చేసినప్పటికి పటాస్ ద్వారా ఆమెకు మంచి బ్రేక్ వచ్చిందని చెప్పుకోవాలి. ఇన్ని రోజుల నుంచి పటాస్ సక్సెస్ గా నడవడానికి కారణం శ్రీముఖి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ షోలో శ్రీముఖి చేసే డ్యాన్స్,, తన మాటలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యూత్ లో ఈషోను ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది శ్రీముఖి.

తాజాగా ఉన్న సమాచారం మేరకు శ్రీముఖి పటాస్ నుంచి కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం పటాస్ నిర్వాహకులు వద్ద నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపింది. ఈవిషయాన్ని శ్రీముఖి వీడియో ద్వారా తెలిపింది. శ్రీముఖి లేకుండా పటాస్ షో ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పటాస్ అభిమానులు.

శ్రీముఖి తన ఇస్టాగ్రామ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పటాస్ షో ద్వారా చాలా మంది ఆర్టీస్టులు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ షోకు స్టూడెంట్ గా వచ్చి కమెడీయన్ గా సెటిల్ అయిన యాదమ్మ రాజు, ఎక్స్ ప్రెస్ హరిలు కూడా ఈ షో మానేసినట్టు తెలిపిన సంగతి తెలిసిందే. అసలు పటాస్ షోలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అని అలోచిస్తున్నారు ప్రేక్షకులు.