బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తునే అటూ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు యంకర్ రవి. తాజాగా ఆయన పేరు మీద ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి తనకు తెలియకుండా కొందరు వ్యక్తులు మీడియాపై దుష్ప్ర్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి కొన్నిమీడియా ఛానెల్స్‌పై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న విషయంపై యాంకర్ రవి స్పందిస్తూ..నా ట్విట్టర్ ఖాతా నుంచి కొందరు వ్యక్తులు నేనే మీడియాపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నట్టు ట్వీట్లు చేశారని..దానికి నాకు ఎలాంటి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశాడు. చాలా రోజుల నుంచి ట్విట్టర్ ఖాతాలో యాక్టివ్‌గా లేనని ఫేస్‌బుక్‌ను మాత్రం వాడుతున్నానని ఆయన తెలిపారు. నాపై కావాలనే ఎవరో ఇదంతా చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ విషయం పట్ల మీడియా మిత్రులెవరూ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదని ఆయన విజ్ఞప్తి చేశాడు. తన పేరు మీద ట్విట్టర్ ఖాతా నుంచి పోస్టులు పెట్టినవారిపై కేసులు పెడతానని ఆయన తెలిపారు.