పటాస్ కు యాంకర్ రవి గుడ్ బై…

723
Anchor ravi Patas
- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. తనదైన పంచులతో ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. తన ఎనర్జీ, డ్యాన్స్ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రవి అంటే మనకు గుర్తుకు వచ్చే షో పటాస్. అయితే తాజాగా రవి పటాస్ ను నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ.. ఇక నుంచి పటాస్ షో లో కనిపించను. 4సంవత్సరాలుగా నన్ను ఆదరించిన బుల్లితెర ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను 2009లో సమ్ ధింగ్ స్పెషల్ షో ద్వారా యాంకర్ గా పరిచయమయ్యాను. ఆ షోలో నాతో పాటు లాస్య కూడా చేసింది. మా ఇద్దరి జోడిని ప్రేక్షకులు ఆదరించారు.

ఆ తర్వాత మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ లో పటాస్ అనే షో శ్రీముఖి తో కలిసి చేశాను. శ్రీముఖి చాలా టాలెంటెడ్..చాలా కష్టపడుతుంది అని చెప్పాడు. అలాగే శ్రీముఖి నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపాడు. పటాస్ షో ను ఇంత హిట్ చేసినందుకు ప్రేక్షులకు రుణపడి ఉంటాను. నేను శ్రీముఖి కలిసి పటాస్ షో ను ప్రారంభించాం..ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్ అని చెప్పారు. నేను లేకపోయినా పటాస్ షో నడుస్తుందని..ఇక నుంచి పటాస్ షో లో చలాకి చంటి, వర్షిణి లు యాంకర్లుగా చేస్తారని చెప్పారు.

https://youtu.be/2D3g6I5t34w

- Advertisement -